
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
హైదరాబాద్, వెలుగు : టోల్ చార్జీలను 5 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. టోల్ చార్జీలను పెంచడమంటే ప్యాసింజర్లపై తీవ్ర భారాన్ని మోపడమేనన్నారు. వాహనాలను ఆరు కేటగిరీలుగా విభజించి.. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుపై టోల్ చార్జీలను 5శాతం పెంచుతు న్నట్లు ఐఆర్‌బీ సంస్థ ప్రకటించిందని గుర్తుచేశారు.
దీనివల్ల రూ.5 నుంచి రూ.50 వరకు ప్రజలపై భారం పడనుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ భావిస్తోందన్నారు. తక్షణమే పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘‘ఏటా టోల్ రుసుం పెంచి వాహనదారులపై భారం మోపడం సరైందికాదు. టోల్‌గేట్ల వద్ద మంచినీరు, వాష్‌రూమ్స్ తదితర కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో పా టు
గ్రామాలకు ఇరువైపుల సర్వీసు రోడ్లు కూడా వెయ్యలేదు. చాలా సందర్భాల్లో టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రించడంలో విఫలమవుతున్నారు. కనీస సౌకర్యా లు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. టోల్‌గేట్ సం స్థల యజమానులకు దోచిపెట్టడమే అవుతుంది”అని తమ్మినేని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.