వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRSతో కలిసి పనిచేస్తాం:తమ్మినేని వీరభద్రం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRSతో కలిసి పనిచేస్తాం:తమ్మినేని వీరభద్రం

తెలంగాణలో మత రాజకీయాలకు తావులేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ నేతలు స్వామిజీల పేరుతో వచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నమునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో డబ్బు, మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించారని ఆరోపించారు. మునుగోడులో సీపీఎం బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని చెప్పారు. 

బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగడతామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. పేదల ఇండ్ల స్థలాలపై తమ పోరాటం ఆగదన్నారు. హనుమకొండ జిల్లాల సీపీఎం జిల్లా శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.