ఇండ్లకు పగుళ్లు...ఇండ్లు ఖాళీ చేస్తున్న జనం

ఇండ్లకు పగుళ్లు...ఇండ్లు ఖాళీ చేస్తున్న జనం

జమ్మూకశ్మీర్లోనూ ఉత్తరాఖండ్‌ జోషిమఠ్‌ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దోడా జిల్లాలో పలు ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. థాత్రి పట్టణంలోని ఓ బస్తీలో ఏడు ఇళ్ల గోడలకు నెర్రెలు వచ్చాయి.  దీంతో  భయాందోళనకు గురైన యజమానులు ఆ ఇండ్లను ఖాళీ చేశారు. 

ఇండ్లకు పగుళ్లు ఏర్పడ్డాయన్న సమాచారంతో దోడా జిల్లా జియాలజిస్టులు, ఉన్నతాధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అందుకు కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. థాత్రి పట్టణంలో మరికొన్ని భవనాలు సైతం ప్రమాదకర స్థితిలో ఉన్నాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో పగుళ్లు పెరిగే అవకాశం ఉందని, త్వరలో ఈ ప్రాంతం కుంగిపోయే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.  ప్రస్తుతం ప్రమాదకరస్థితిలో ఉన్న భవనాల్లోని వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అన్నారు.