క్రేజీ బాయ్స్ ఫన్ రైడ్‌‌‌‌‌‌‌‌ : సుప్రియ యార్లగడ్డ

క్రేజీ బాయ్స్  ఫన్ రైడ్‌‌‌‌‌‌‌‌ : సుప్రియ యార్లగడ్డ

కన్నడలో సక్సెస్ సాధించిన ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ చిత్రం ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగులోకి వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి విడుదల చేస్తున్నాయి. నితిన్ కృష్ణమూర్తి దర్శకుడు. ఆగస్టు 26న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ ‘‘‘ఈ సినిమా ఒక క్రేజీ ఫన్ రైడ్. ట్రైలర్ చూడగానే నవ్వొచ్చింది. ఆ ఎనర్జీని, మ్యాజిక్‌‌‌‌‌‌‌‌ని  రీ క్రియేట్ చేయలేం. 

అందుకే  రీమేక్ చేయడం కంటే ఒరిజినల్‌‌‌‌‌‌‌‌గానే చూడాలి. కానీ వందకుపైగా వాయిస్‌‌‌‌‌‌‌‌లు, హాస్టల్‌‌‌‌‌‌‌‌లో వాళ్లు చేసే అల్లరిని తెలుగులో డబ్ చేయడం చాలా కష్టమైంది. చాలా కేర్ తీసుకొని ప్రతి వాయిస్‌‌‌‌‌‌‌‌ని నేటివిటికి తగ్గట్టుగా డబ్ చేశాం.  ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. రష్మి పాత్రతో సినిమాకి మరింత నేటివిటీ వచ్చింది. మనదంటూ ఒక ఫ్లేవర్ యాడ్ అయ్యింది. దీనికి ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్. చాలా హాట్ గా కనిపిస్తుంది. ‘చాయ్ బిస్కట్’ ఫిలిమ్స్‌‌‌‌‌‌‌‌తో కొలాబరేట్ అవడం హ్యాపీ. ఇక అన్నపూర్ణ సంస్థలో గత యాభై ఏళ్లుగా నిలకడగా సినిమాలు తీస్తున్నాం. 

లెగసీని కాపాడుకోవడం కోసం చాలా కేర్ తీసుకుంటున్నాం. నాగార్జున గారి కంటే బెటర్ ప్రొడ్యూసర్ మరెవరూ లేరు. నిర్మాతగా ఆయన ఎప్పుడో చేసిన ప్రయోగాలు ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఆయన యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవడం వల్లే అన్నపూర్ణ స్టూడియో నిలబడింది. ఇక నేను ‘గూఢచారి’లో నటించింది సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేద్దామని కాదు. యాక్టింగ్ వచ్చా రాదా అని చెక్ చేసుకోడానికి (నవ్వుతూ). ఆ మూవీ సీక్వెల్‌‌‌‌‌‌‌‌లో నా పాత్ర ఉంటే మళ్లీ నటిస్తా’’.