1.93 శాతానికి తగ్గిన క్రెడిట్ రేషియో.. కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్జ్ రేటింగ్స్ రిపోర్ట్

1.93 శాతానికి తగ్గిన క్రెడిట్ రేషియో.. కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్జ్ రేటింగ్స్ రిపోర్ట్

హైదరాబాద్​, వెలుగు: 2026 ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో కంపెనీల క్రెడిట్ రేషియో 1.93 శాతానికి తగ్గింది. మొదటి భాగంలో ఇది 2.56 శాతంగా ఉంది. అంటే ప్రతి ఒక్క డౌన్​గ్రేడ్​కు సుమారుగా రెండు అప్​గ్రేడ్లు ఉన్నాయి. కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక ప్రకారం..ఈ కాలంలో 363 సంస్థల రేటింగ్ పెరగగా, 188 సంస్థల రేటింగ్ తగ్గింది.

చమురు ధరలు మరింత పెరిగితే 2027లో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి పరిమితం కావచ్చని అంచనా. ఫార్మా, ఆటో, రియల్ ఎస్టేట్ రంగాల్లో రేటింగ్ మెరుగుపడగా రసాయనాలు, ఎగుమతి రంగాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మౌలిక వసతుల రంగంలో క్రెడిట్ రేషియో 1.67 శాతంగా నమోదైంది. ఎంఎస్​ఎంఈలు కూడా యుద్ధం వల్ల ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది.