
టీ-20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై ఉత్కంఠ పోరులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరి బాల్ వరకు చెమటలు పట్టించిన ఈ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం జట్టు ఓటమి పై పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పందించాడు.
విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా జోడీని విడదీయకపోవడమే తాము చేసిన తప్పన్నాడు. అదే ఓటమి కారణమైదని బాబర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ, పాండ్యా జోడీని విడదీయాడానికే తమ స్పిన్నర్ షాదాబ్ ఖాన్‌ను చివరి వరకూ ఆపామన్నాడు. కోహ్లీ, పాండ్యాలు తమ అసాధారణమైన బ్యాటింగ్‌తో మా ఓటమిని శాసించారన్నాడు. ఈ మ్యాచ్ లో షాన్ మసూద్, ఇఫ్తికార్‌లు అద్భుతంగా రాణించారని, బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారని బాబర్ చెప్పాడు.
పాక్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ అఖరి ఓవర్లో ఛేదించింది. భారత్ బ్యాటర్లలో రోహిత్ (4), రాహుల్ (4), సూర్యకుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) విఫలమైయినప్పటికీ విరాట్ కోహ్లీ (82 నాటౌట్), హార్దిక్ పాండ్య (40)రాణించి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 159 రన్స్ చేసింది. పాక్ ప్లేయర్స్ లో మసూద్ 52, హమీద్ 51 రన్స్ తో రాణించారు. ఈ విజయంతో టీమిండియా రెండు పాయింట్లతో గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉంది.