అగార్కర్‌ వచ్చారు.. జీతం పెంచారు.. ఎన్ని కోట్లో తెలుసా?

అగార్కర్‌ వచ్చారు.. జీతం పెంచారు.. ఎన్ని కోట్లో తెలుసా?

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో దొరకడంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. ఈ పోస్టుకు పలువురు మాజీ ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా అగార్కర్‌ను ఈ పదవి వరించింది. అయితే చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్ అందుకునే జీతంపై ఇప్పుడు తీవ్రమైన చర్చ నడుస్తోంది. 

గతంలో చీఫ్ సెలక్టర్‌కు ఏడాదికి కోటి రూపాయలు వేతనంగా ఇస్తుండగా, ఇప్పుడు దానిని రూ.3 కోట్లకు పెంచినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. అంటే గతంలో ఉన్న దానితో పోలిస్తే.. మూడింతలు పెంచిందన్నమాట. కోటి రూపాయలు తక్కువ మొత్తమని.. దిగ్గజ ఆటగాళ్లు చీఫ్ సెలక్టర్ పదవి చేపట్టేందుకు ముందుకు రావడం లేదట. ఈ క్రమంలోనే బీసీసీఐ వేతనాన్ని భారీగా పెంచినట్లు క్రిక్‌బజ్ తెలిపింది. కాగా, చీఫ్ సెలక్టర్ వార్షిక జీతాన్ని మూడు కోట్లకు పెంచిన బీసీసీఐ.. ఇతర సెలక్టర్ల వేతనాన్ని 90 లక్షలు పెంచినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు