ఉప్పల్ స్టేడియానికి పోటెత్తిన క్రికెట్ ఫ్యాన్స్

ఉప్పల్ స్టేడియానికి పోటెత్తిన క్రికెట్ ఫ్యాన్స్

గ్రేటర్ జనం క్రికెట్​పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్​కు రెండో రోజూ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా సెలవు కావడంతో ఏకంగా 30 వేల 886 మంది హాజరయ్యారు. ఒక టెస్టు మ్యాచ్​కు ఈ స్థాయిలో  ఫ్యాన్స్ రావడం ఇటీవల కాలంలో కనిపించలేదు. స్కూల్ స్టూడెంట్లతో పాటు రిపబ్లిక్ డే సందర్భంగా  సైనిక బలగాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) ఉచిత ప్రవేశం కల్పించింది. సాధారణ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో స్టేడియం మొత్తం నిండి కలర్​ఫుల్​గా మారింది. హెచ్ సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఉచిత ప్రవేశం కల్పించిన స్కూల్ స్టూడెంట్లు, ఆర్మీ సిబ్బంది ఉన్న వెస్ట్ స్టాండ్​కు వెళ్లారు. వారితో కలిసి టీమిండియా ప్లేయర్లను ఉత్సాహపరిచారు. అలాగే స్టేడియం మొత్తం తిరిగి సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఓ స్టాండ్ లో నిర్ణీత ధర కంటే ఎక్కువ రేటుకు ఫుడ్ అమ్ముతున్న స్టాల్ నిర్వాహకులను తీవ్రంగా మందలించారు. ఉదయం స్టేడియంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హెచ్​సీఏ ఆఫీస్ బేరర్లు, సిబ్బందితో కలిసి జెండా వందనంలో పాల్గొన్నారు. 

– వెలుగు, హైదరాబాద్