Cricket World Cup 2023: పాకిస్తాన్ బౌలింగ్.. గెలిస్తేనే సెమీస్ ఆశలు

Cricket World Cup 2023: పాకిస్తాన్ బౌలింగ్.. గెలిస్తేనే సెమీస్ ఆశలు

వన్డే ప్రపంచ కప్ లో భాగంగా నేడు(శుక్రవారం) పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆసీస్ మొదట బ్యాటింగ్ చేయనుంది. బెంగళూరు, చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

ఇరు జట్లకు ఈ మ్యాచ్ చావో రేవో వంటిది. గెలిస్తే సెమీస్ వైపు అడుగులు వేయిచ్చు. ఓడితే మాత్రం సెమీస్ అవకాశాలు మరింత సన్నగిల్లుతాయి.

Also Read :- ఉప్పల్ స్టేడియంలోHCA ఎన్నికల పోలింగ్

తుది జట్లు

పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, ఉసామా మీర్, మహమ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.