రెస్టారెంట్ ఓపెన్ చేసిన సురేష్ రైనా.. ఏ దేశంలో అంటే?

రెస్టారెంట్ ఓపెన్ చేసిన సురేష్ రైనా.. ఏ దేశంలో అంటే?

టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. యూరప్ నడిబొడ్డున నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో తన పేరిట ఇండియన్ రెస్టారెంట్ నెలకొల్పాడు. దానికి 'రైనా ఎస్ఆర్' అని పేరు పెట్టాడు. అందుకు సంబంధించిన ఫొటోలను రైనా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

సురేష్ రైనా షేర్ చేసిన ఫోటోలలో ఒకదానిలో అతను ప్లేట్‌లో గులాబ్ జామూన్‌తో కనిపిస్తున్నాడు. చెఫ్ డ్రెస్ వేసుకుని చేతిలో గులాబ్ జామూన్ ప్లేటుతో ఫోటోకి ఫోజులిచ్చాడు. భారతీయ రెస్టారెంట్ తెరవడం అనే ఒక కల నిజమైందని వెల్లడించిన రైనా.. ఈ రెస్టారెంట్ ద్వారా విభిన్న రుచులను ప్రజలకు అందించగలను.. అని రాసుకొచ్చాడు.

'ఆమ్‌స్టర్‌డామ్‌లో రైనా ఇండియన్ రెస్టారెంట్ పరిచయం చేసినందుకు చాలా సంతోషిస్తున్నా. భారత్‌కు మాత్రమే పరిమితమైన రుచులను నా రెస్టారెంట్ ద్వారా ఇక్కడి ప్రజలకు పరిచయం చేస్తా. ఉత్తర భారతదేశ మసాలా వంటకాల మొదలు దక్షిణ భారతదేశ ఘుమఘుమలు వరకూ అన్నీ.. నా రెస్టారెంట్‌కు వచ్చిన వారికి నోరూరించేలా చేస్తా.." అని రైనా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రైనాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ అందురూ కామెంట్లు పెడుతున్నారు.
 

I am absolutely ecstatic to introduce Raina Indian Restaurant in Amsterdam, where my passion for food and cooking takes center stage! ?️ Over the years, you've seen my love for food and witnessed my culinary adventures, and now, I am on a mission to bring the most authentic and… pic.twitter.com/u5lGdZfcT4

— Suresh Raina?? (@ImRaina) June 23, 2023