వీడియో: ఇంద్రభవనమే.. అలీబాగ్‌లోని కోహ్లీ కొత్త ఇళ్లు చూడండి

వీడియో: ఇంద్రభవనమే.. అలీబాగ్‌లోని కోహ్లీ కొత్త ఇళ్లు చూడండి

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని సతీమణి అనుష్క శర్మ కొత్త ఇళ్లు నిర్మించుకున్న విషయం తెలిసిందే. ఈ జంట ఎంతో ముచ్చటపడి దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో మహారాష్ట్రలోని అలీబాగ్‌లో తమ హాలీడే హోమ్ కట్టించుకున్నారు. ఎంతో విలాసవంతంగా నిర్మించుకున్న ఆ ఇంటికి సంబంధించి కోహ్లి ఓ వీడియో విడుదల చేశారు.

వీడియోలో కోహ్లీ తన లివింగ్ రూమ్ మొదలు..  బెడ్ రూమ్ వరకూ ప్రతి అంగుళాన్నీ చూపించారు. ఆవాస్ లివింగ్ హోమ్‌గా నామకరణం చేసిన ఈ ఇళ్లు.. ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాలిఫోర్నియన్ కొంకణ్ స్టైల్లో ఇళ్ళు నిర్మించారు. ప్రకృతిలో పర్వశించడానికి చుట్టూ పచ్చని చెట్లు, జలకాలు ఆడటానికి స్విమ్మింగ్ పూల్ వంటివి అన్నీ ఉన్నా.. ఇందులోనూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఇంట్లో ఎలాంటి టీవీలు, ఇతర ఎంటర్‌టైన్మెంట్ గాడ్జెట్స్ లేవు. ఈ విషయాన్ని కోహ్లి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రశాంతంగా కూర్చొని ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకుంటూ గడపాలన్నదే తన ఉదేశ్యమని.. అందుకే తమ మధ్య వాటికి చోటివ్వలేదని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

తొలి మ్యాచ్‌కు కోహ్లీ దూరం

ఇదిలావుంటే, జనవరి 11న అఫ్ఘనిస్తాన్‌ తో జరగనున్న తొలి టీ20కి కోహ్లీ దూరం కానున్నాడని సమాచారం. వ్యక్తిగత కారణాల రీత్యా అతను తప్పుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.