కామన్వెల్త్ మెడలిస్టులపై కోహ్లీ ప్రశంసల జల్లు

కామన్వెల్త్ మెడలిస్టులపై కోహ్లీ ప్రశంసల జల్లు

కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులను  టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ అభినందించాడు. కామన్వెల్త్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారని కొనియాడాడు. ప్రపంచ వేదికపై పతకాలు సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారని మెచ్చుకున్నాడు. 

గర్విస్తున్నా..
అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి గొప్ప పురస్కారాలు అందించారు. కామన్వెల్త్‌ గేమ్స్‌-2022లో పాల్గొన్న వారితో పాటు..పతకాలు గెలిచిన వాళ్లందరికీ నా శుభాకాంక్షలు.  మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాం. జై హింద్‌ అంటూ కోహ్లీ ట్విట్టర్లో పేర్కొన్నాడు. పతకాలు సాధించిన అథ్లెట్స్ ఫోటోను షేర్ చేశాడు. 

61 పతకాలతో నాల్గో స్థానం..
జూలై 29 నుంచి ఆగష్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో  కామన్‌వెల్త్‌ గేమ్స్ జరిగాయి.  ఈ ఈవెంట్‌లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు సాధించింది. మొత్తంగా 61 పతకాలతో  పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
రెజ్లింగ్‌లో 12, వెయిట్‌లిఫ్టింగ్‌లో 10, అథ్లెటిక్స్‌లో 8, బాక్సింగ్‌లో 7, టేబుల్‌ టెన్నిస్‌లో 7, బ్యాడ్మింటన్‌లో 6, జూడోలో 3, హాకీలో 2, లాన్‌ బౌల్స్‌లో 2, స్వ్కాష్‌లో 2, టీ20 క్రికెట్‌లో 1, పారా పవర్‌లిఫ్టింగ్‌లో 1 అథ్లెట్స్ పతకాలను సాధించారు.