పాపం ఫోటో దిగాడు.. కెరీర్ పోయింది

పాపం ఫోటో దిగాడు.. కెరీర్ పోయింది

ప్రముఖ భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ భారత టీమ్ లో స్థానం కోల్పోయినట్టు వార్తలు పుకార్లు చేస్తున్నాయి. దానికి కారణం మరెవరో కాదు.. తెలుగు బుల్లితెర యాంకర్ వర్షిణి. ఈమె తాజాగా హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ చూడటం కోసం స్టేడియం కు వెళ్ళింది. ఇందులో భాగంగా.. వర్షిణి, వాషింగ్టన్ సుందర్ తో ఫోటో దిగి వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. 

అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు ఇదే ఫోటో వాషింగ్టన్ సుందర్ ను టీమ్ నుండి బయటకు వచ్చేలా చేసిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వర్షిణి, వాషింగ్టన్ సుందర్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, ఆమె కారంగానే వాషింగ్టన్ సుందర్ ను టీం నుంచి తప్పించారని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 

మరి నిజంగా ఈ కారణంగానే వాషింగ్టన్ సుందర్ టీంలో స్థానం కోల్పోయాడా? మరి ఈ కామెంట్స్ పై ఈ జంట ఎలా స్పందిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.