గ్రూప్–1 రద్దుతో యువకుడు ఆత్మహత్య

గ్రూప్–1 రద్దుతో యువకుడు ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్–1 పరీక్ష రద్దు చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన చిటికెన నవీన్ (32) అనే యువకుడు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం లేదని, అన్ని ఉద్యోగాలకు కూడా అనర్హుడుని అవుతున్నానని మనస్తపంతో నవీన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తన చావుకు ఎవరూ కారణం కాదని నవీన్ సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఆరేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తనకు గ్రూప్–1 పరీక్ష రద్దు కావడంతో ‌నిరాశ కలిగిందని..ఇక ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని.. జీవితం‌పై విరక్తి వచ్చిందని సూసైడ్ లెటర్ లో రాసుకొచ్చాడు నవీన్. ఉరి వేసుకున్న నవీన్ వద్ద లభ్యమైన నోట్ ఆధారంగా  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.