సీఎంఆర్‌‌‌‌ కంప్లీట్ చేయని మిల్లుపై కేసు .. రెవెన్యూ రికవరీ​ యాక్ట్ కింద సీజ్

సీఎంఆర్‌‌‌‌ కంప్లీట్ చేయని మిల్లుపై కేసు .. రెవెన్యూ రికవరీ​ యాక్ట్ కింద సీజ్

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో సీఎంఆర్​అప్పగించని మిల్లుపై క్రిమినల్​ కేసు నమోదైంది. రెవెన్యూ రికవరీ చట్టం కింద మిల్లును సీజ్​చేయడంతో పాటు ఆస్తుల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. యాదాద్రి జిల్లాలో 2022–-23 వానాకాలం సీజన్​లో సీఎంఆర్‌‌‌‌ కింద 44  మిల్లులకు 2,85,218 టన్నుల వడ్లను సివిల్​సప్లై డిపార్ట్​మెంట్​అందించింది. ఈ మిల్లులు 1,91,250 టన్నుల బియ్యాన్ని ఎఫ్‌‌సీఐకి డెలివరీ చేయాలి.

కానీ, 43 మిల్లుల నుంచి 1,90,333 (99.50 శాతం)టన్నుల సీఎంఆర్​సేకరణ జరిగింది. కానీ, 1975 టన్నుల వడ్లు తీసుకున్న  గుండాల మండలం అనంతారంలోని ఎల్ఎన్​ రెడ్డి (లక్ష్మీ నారాయణ రెడ్డి) బిన్నీ రైస్ మిల్లు 14 శాతం మాత్రమే సీఎంఆర్​ కంప్లీట్‌‌ చేసింది. అయితే మిల్లు యజమాని లక్ష్మీ నర్సింహా రెడ్డి గతేడాది మృతి చెందడంతో అతడి బంధువులు లీల, ఎల్లారెడ్డి ఈ మిల్లును టేకోవర్​ చేసుకున్నారు.

 వీళ్లు వడ్లను మరాడించినా.. 14 శాతం బియ్యం మాత్రమే ఎఫ్‌‌సీఐకి అందించారు. బకాయిఉన్న 1150 టన్నులపై సివిల్‌‌ సప్లై ఆఫీసర్లు ప్రశ్నించగా తమకు సంబంధం లేదని అప్పటి మిల్లు యజమానితో మాట్లాడుకోండని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో 1150 టన్నుల  వాల్యూ రూ.4 కోట్లు కాగా.. రూ.1.23 కోట్ల ఫెనాల్టీ విధించారు. అయినా వాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇటీవల అడిషనల్​ కలెక్టర్​ భాస్కర్​రావు మిల్లును తనిఖీ చేయగా అక్కడ వడ్లు, బియ్యం కనిపించలేదు. దీంతో సివిల్​ సప్లయ్​ డీఎం గోపికృష్ణ, డీఎస్​వో శ్రీనివాసరెడ్డి గుండాల పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

మృతి చెందిన మిల్లు యజమాని లక్ష్మి నారాయణ రెడ్డి సోదరుడైన నరేందర్​ రెడ్డి, మిల్లును టేకోవర్​ చేసిన లీల, ఎల్లారెడ్డిపై 420 సెక్షన్​ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా చేసి రెవెన్యూ రికవరీ చట్టం కింద మిల్లును సీజ్‌‌ చేశారు. దీంతో మిల్లు గత యజమాని, ప్రస్తుతం టేకోవర్​ చేసిన వారి ఆస్తుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఆస్తులను ఇతరులకు విక్రయించకుండా బ్లాక్​లో పెట్టనున్నారు. సివిల్​ సప్లయ్​డిపార్ట్​మెంట్​ ఇవ్వాల్సిన రూ. 5.23 కోట్లు చెల్లించని పక్షంలో గుర్తించిన ఆస్తులను వేలం వేసే అవకాశాలు ఉన్నాయి