విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులపై క్రిమినల్​ కేసులు

విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులపై క్రిమినల్​ కేసులు

కల్వకుర్తిలో మంత్రి కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్​ లోని ఎల్బీ నగర్ లో దిష్టిబొమ్మ ను దహనం చేశారు.  ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పలువురిపై క్రిమినల్​ కేసులు నమోదయ్యాయి. కేటీఆర్​ దిష్టిబొమ్మను దహనం చేశారనే అభియోగాలతో కొందరు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులపై ఎల్బీ నగర్ పీఎస్ లో ఐపీసీ 341,143,290 r/w 149  సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కేటీఆర్​ వ్యాఖ్యలపై శనివారం మెట్​ పల్లి పోలీసు స్టేషన్​ లో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. మీర్​ పేట్​, కామారెడ్డి, మహబూబ్​ నగర్​ లలోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.