మాల్ ​ప్రాక్టీస్​కు పాల్పడితే ​ క్రిమినల్​ కేసులు నమోదు చేస్తాం : కలెక్టర్​ అనుదీప్

మాల్ ​ప్రాక్టీస్​కు పాల్పడితే ​ క్రిమినల్​ కేసులు నమోదు చేస్తాం : కలెక్టర్​ అనుదీప్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గ్రూప్–1 ఎగ్జామ్​లో మాల్ ​ప్రాక్టీస్​కు పాల్పడితే ​ క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్​ అనుదీప్  తెలిపారు. కలెక్టరేట్​లో బుధవారం ఎస్పీ డాక్టర్​ వినీత్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16న జరుగనున్న గ్రూప్–1 ఎగ్జామ్​కు 23 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లిలో ఏర్పాటు చేసిన సెంటర్లలో 8851 మంది పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. ప్రతి రూమ్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, చీఫ్​ సూపరింటెండెంట్​తో పాటు కలెక్టరేట్​ నుంచి పర్యవేక్షించేలా అనుసంధానం చేసినట్లు తెలిపారు. కలెక్టరేట్, బస్టాండ్​ సెంటర్లలో హెల్ప్​డెస్క్​ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉదయం 8.30 నుంచి 10.15 వరకు మాత్రమే అభ్యర్థులను ఎగ్జామ్​ సెంటర్లలోకి అనుమతిస్తామని చెప్పారు. ఎస్పీ డాక్టర్​ వినీత్​ మాట్లాడుతూ ప్రతి ఎగ్జామ్​ సెంటర్​కు వంద మీటర్ల దూరం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. డీఆర్వో అశోక్​ కుమార్, ఏవో గన్యా పాల్గొన్నారు. 

ఏర్పాట్లు పూర్తి 

ఖమ్మం టౌన్ : గ్రూప్–1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు​ కలెక్టర్  వీపీ గౌతమ్ తెలిపారు. జిల్లాలో17,366 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానుండగా, 58 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.