V6 News

రొనాల్డో ఇంట విషాదం

రొనాల్డో ఇంట విషాదం

మాంచెస్టర్:  పోర్చుగల్‌‌‌‌‌‌‌‌ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఇంట  విషాదం చోటు చేసుకుంది. రొనాల్డో, జార్జినా దంపతులకు ఇటీవల జన్మించిన కవలల్లో ఒకరు మృతి చెందారు. తమ బాబు చనిపోయిన విషయం పంచుకుంటున్నందుకు చాలా బాధగా ఉందన్న రొనాల్డో.. పాప బతికి ఉన్న విషయం ఒక్కటే ఇప్పుడు కొంత ఆశ, ఆనందాన్ని ఇస్తుందని అన్నాడు. ఈ సమయంలో అండగా ఉన్న డాక్టర్లకు, నర్సులకు ధన్యవాదాలు తెలిపాడు. రొనాల్డోకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు.