
జగిత్యాల జిల్లా వెల్గటూర్ వాగులో మొసలి కనిపించడం కలకలం రేపింది. వాగులో కొట్టుకు వచ్చిన మొసలిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడి నుంచో కొట్టుకువచ్చిన మొసలి..వెల్గటూరు వాగులో ప్రత్యక్షమైంది. అయితే వ్యవసాయ పొలాలకు వెళ్లిన రైతులు..మొసలిని చూసి పరుగులు తీశారు. మొసలి బరువు దాదాపు 100 కిలోల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు. వాగులోకి వెళ్లకూడదని జాగ్రత్తగా ఉండాలన్న ఉండాలని రైతులకు స్థానికులు సూచిస్తున్నారు.