మస్కాపూర్​ శివారులో మొసలి కలకలం

మస్కాపూర్​ శివారులో మొసలి కలకలం

ఖానాపూర్, వెలుగు:  నిర్మల్​ జిల్లా ఖానాపూర్  మండలం  మస్కాపూర్ శివారులోని నీటి కుంటలో సోమవారం ఓ మొసలి కనిపించి జనాలను కలవరపెట్టింది. కస్తూర్బా గాంధీ స్కూల్ గోడను ఆనుకుని ఉన్న చిన్న నీటి కుంట నుంచి బయటకు వచ్చిన సేద దీరుతూ కనిపించింది. ఇది చూసిన విద్యార్థులతో పాటు గ్రామస్తులు భయపడ్డారు. అంతా అక్కడ గుమిగూడడం, రాళ్లతో కొట్టడంతో తిరిగి కుంటలోకి వెళ్లిపోయింది. మస్కాపూర్​ ఖానాపూర్​‌‌–మెట్​పల్లి మెయిన్​రోడ్డును ఆనుకుని ఉంటుంది. గతంలో భారీ వర్షాలు పడినప్పుడు సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఒర్రెల నుంచి చిన్న మొసలి పిల్ల కొట్టుకు వచ్చి ఉండొచ్చని, ఈ కుంటలోనే పెద్దదై ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. మొసలిని గోదావరిలోకి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.