క్రోమా ఆపిల్ సేల్ ధమాకా: రూ.45వేలకే ఐఫోన్ 17.. ఆఫర్ దక్కించుకునేందుకు ఒక్క రోజే ఛాన్స్

క్రోమా ఆపిల్ సేల్ ధమాకా: రూ.45వేలకే ఐఫోన్ 17.. ఆఫర్ దక్కించుకునేందుకు ఒక్క రోజే ఛాన్స్

ఆపిల్ గ్యాడ్జెట్స్ కొనాలని కలలు కనేవారికి క్రోమా అదిరిపోయే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. తన సూపర్ హిట్ 'ఎవ్రీథింగ్ ఆపిల్' సేల్ ఫేజ్ 2ను లైవ్‌లోకి తెస్తూ.. ఐఫోన్లు, మ్యాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌లు, ఆపిల్ వాచ్‌లపై కళ్లు చెదిరే భారీ ఆఫర్లను ప్రకటించింది. మే 1 నుండి మే 16 వరకు నడిచే ఈ పరిమిత కాలపు సేల్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో పాటు ప్రత్యేకంగా టాటా న్యూ కాయిన్స్ రూపంలో భారీ ప్రయోజనాలను అందిస్తోంది.

ఈ సేల్‌లో అన్నింటికంటే అతిపెద్ద హైలైట్ ఏమిటంటే.. రూ.82వేల 900 ఎంఆర్‌పీ కలిగిన సరికొత్త ఐఫోన్ 17(256GB) మోడల్‌ను ఊహించని ధరకు సొంతం చేసుకునే అవకాశం కల్పించడమే. క్రోమా అందిస్తున్న విభిన్న ఆఫర్లను కలుపుకుంటే.. ఈ ప్రీమియం ఫోన్‌ను కేవలం రూ.44వేల 768 ఎఫెక్టివ్ ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో పాత స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్టంగా రూ.23వేల 500 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ లభిస్తుంది. దీనికి అదనంగా మరో రూ.8వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను క్రోమా ఇస్తోంది. వీటితో పాటు రూ.1,658 విలువైన డిస్కౌంట్ కూపన్, అలాగే రూ.4వేల 974 విలువైన టాటా నియా కాయిన్స్ లభిస్తాయని క్రోమా వెల్లడించింది. ఈ ఫైనల్ ప్రైసింగ్ అనేది కస్టమర్లు ఎక్స్ఛేంజ్ చేసే పాత మొబైల్ కండిషన్, స్టోర్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. మిగిలిన ఐఫోన్ మోడళ్లపై కూడా మంచి తగ్గింపులను అందిస్తోంది క్రోమా. 

స్టూడెంట్స్, టీచర్స్ ని టార్గెట్ చేస్తూ మ్యాక్‌బుక్, ఐప్యాడ్ లైనప్‌లపై కూడా క్రోమా క్రేజీ డీల్స్ ప్రకటించింది. రూ.లక్షా 19వేల 900 అసలు ధర కలిగిన సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్5 మోడల్‌ను స్టూడెంట్ అండ్ టీచర్ డిస్కౌంట్.. రూ.15వేల ఎక్స్ఛేంజ్ వాల్యూ, రూ.10వేలు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.8వేల 291 టాటా నియా కాయిన్స్ కలిపి కేవలం రూ.74వేల 619 ఎఫెక్టివ్ ధరకే అందిస్తున్నారు. బడ్జెట్ యూజర్ల కోసం మ్యాక్‌బుక్ నియో రూ.39వేల 069 ప్రారంభ ధరకే లభిస్తోంది. ఐప్యాడ్ లైనప్‌లో ఐప్యాడ్ 11వ జనరేషన్ రూ.29వేల 489 వద్ద, ఐప్యాడ్ ఎయిర్ ఎమ్4 రూ.55వేల 490 ప్రారంభ రేటుకు అందుబాటులో ఉన్నాయి.

ఆపిల్ యాక్సెసరీస్ అండ్ వేరబుల్స్ ఇష్టపడే వారి కోసం కూడా ఈ సేల్‌లో సూపర్ డిస్కౌంట్లు ఉన్నాయి. సరికొత్త ఎయిర్‌పాడ్స్ ప్రో 3 రూ. 22వేల 491 ధరతో లభిస్తుండగా, ఎయిర్‌పాడ్స్ 4 మోడల్‌ను రూ.10వేల 791 కే దక్కించుకోవచ్చు. ఫిట్‌నెస్ ప్రియుల కోసం ఆపిల్ వాచ్ ఎస్ఈ 3 ధర రూ.23వేల 388 నుండి ప్రారంభమవుతోంది. మే 16 వరకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ 'ఎవ్రీథింగ్ ఆపిల్' సేల్ ఆఫర్లను క్రోమా స్టోర్లతో పాటు అధికారిక వెబ్‌సైట్, టాటా న్యూ యాప్‌లలో కూడా పొందవచ్చు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ టాటా నియా కార్డ్ హోల్డర్లకు అదనంగా 10 శాతం వరకు ఆదా చేసుకునే సువర్ణావకాశాన్ని క్రోమా కల్పిస్తోంది. లో బడ్జెట్‌లో ఆపిల్ ఎకోసిస్టమ్‌లోకి ఎంటర్ అవ్వాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు.