ఖమ్మం జిల్లాలో 2,980 ఎకరాల్లో పంట నష్టం

ఖమ్మం జిల్లాలో 2,980 ఎకరాల్లో పంట నష్టం

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు 2,980 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. పత్తి వేయి ఎకరాల్లో, వరి ఎక్కువగా నష్టమైనట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. 

నీట మునిగిన పంట పొలాలు..  

కూసుమంచి : మండలంలోని 41జీపీల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాలేరు జలాశయానికి భారీగా వరద చేరడంతో ఆఫీసర్లు దిగువకు నీటిని వదలడంతో పాలేరు పరివాహాక ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాలైన జక్కేపల్లి, గోరీలపాడుతండా, ఒంటిగుడిసెతండా, తుమ్మలతండా, రాజుపేట, ఈశ్వరమాధారం, భగత్​వీడు, మల్లాయిగూడెం, హట్యాతండా, నాయకన్ గూడెం, ఎర్రగడ్డతండా, కొత్తూరు, నర్సింహులగూడెం, కూసుమంచి, పాలేరుల్లోని వందలాది ఎక్కరాల్లో పంటలు నీట మునిగాయి.

అంతేకాకుండా పొలాల్లోని ఇసుక మేటలు తీయాలన్న రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అయినా ఆఫీసర్లు మాత్రం నిర్లక్ష్యం వీడడంలేదని, కాకి లెక్కలు వేసి ప్రభుత్వం నుంచి వచ్చే పంటనష్ట పరిహారం కూడా తమకు దక్కకుండా చేస్తారని వారు ఆరోపిస్తున్నారు.