
నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి అకాల వర్షం కురిసింది. జన్నారం మండలంలోని దేవునిగూడ, ఇందన్ పెల్లి, మురిమడుగు, కలమడుగు, ఖానాపూర్, కడెం, దస్తూరబాద్, పెంబి మండలాల్లో వరి నేలకొరిగింది. సుమారు 200 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు. దేవునిగూడ, కామన్ పెల్లి, మొర్రిగూడ, తపాలపూర్ లో మామిడి కాయలు నేలరాలాయి.
పంటకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఖానాపూర్లో పలు గ్రామాల్లో గాలులకు ఇళ్ల పైకప్పులు, రేకులు లేచి పడ్డాయి.అలాగే రోడ్లపై చెట్లు పడడంతో కరెంట్ కట్ అయింది. వర్షం కారణంగా జొన్న, వరి, నువ్వు, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.