తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 గంటల్లోనే దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..  8 గంటల్లోనే దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం  కలుగుతుంది.  శ్రీవారిని దర్శించుకునేందుకు ఐదు కంపార్ట్ మెంట్లలో  భక్తులు వేచి ఉన్నారు.. ఆదివారం (ఫిబ్రవరి 18) సెలవు దినం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతుంది. టైమ్ స్లాట్ దర్శనానికి 3 కంపార్ట్ మెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోందని అధికారులు వెల్లడించారు. 

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని  ఏర్పాట్లు చేశారు.  కాగా శనివారం రోజున  శ్రీవారిని 71 వేల 021 మంది భక్తులు దర్శించుకోగా 25 వేల 965 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇదే సమయంలో హుండీ ఆదాయం రూ. 4.17 కోట్ల కానుకలు భక్తులు సమర్పించుకున్నట్లుగా టీటీడీ వెల్లడించింది.