గోల్కొండ కోటలో సందర్శకుల రద్దీ

గోల్కొండ కోటలో సందర్శకుల రద్దీ

వరుస సెలవులు రావడంతో గోల్కొండ కోట సందర్శకులతో కిటకిటలాడింది.  ఆది, సోమ, మంగళవారాల్లో గోల్కొండ కోటను చూసేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో వచ్చినట్లు కోట ఇన్​చార్జి, ఆర్కియాలజిస్ట్ నవీన్ కుమార్ తెలిపారు. సోమవారం సుమారు 10 వేల మంది వచ్చినట్లు ఆయన తెలిపారు.