కశ్మీర్‌‌లో ఉగ్రదాడి.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

కశ్మీర్‌‌లో ఉగ్రదాడి.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

జమ్ము కశ్మీర్‌‌లో  నిన్న జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన సీఆర్పీఎఫ్ జవాన్‌ విశాల్ కుమార్‌‌ పార్థివ దేహానికి డీజీపీ దిల్బాగ్‌ సింగ్ నివాళి అర్పించారు. శ్రీనగర్‌‌లోని లాల్‌ చౌక్‌ ప్రాంతంలో  సీఆర్పీఎఫ్ బలగాలపై నిన్న టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. రెండు వైపులా హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. మరో జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. పుల్వామాలో ఇద్దరు వలసకార్మికులపై కాల్పులు జరిపిన కొద్ది గంటలకే లాల్ చౌక్ లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అమరుడైన జవాన్‌ను సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ విశాల్ కుమార్‌‌గా గుర్తించారు. ఈ జవాన్‌ భౌతిక కాయానికి బుద్గాంలో ఇవాళ ఉదయం జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్‌ సింగ్ నివాళి అర్పించారు. అలాగే సీఆర్పీఎఫ్ జవాన్లు సైనిక వందనం చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ దిల్బాగ్‌ సింగ్ మాట్లాడుతూ జమ్ము కశ్మీర్‌‌లో ఉగ్రమూకల పిచ్చ చర్యలను సహించబోమని చెప్పారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాన్‌కు సెల్యూట్ చేస్తున్నామని అన్నారు. కశ్మీర్‌‌లో శాంతి భద్రతలను కాపాడేందుకు మన బలగాలు, జమ్ము కశ్మీర్ పోలీసులు నిరంతరం పోరాడుతూనే ఉంటారని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

పబ్‎లో దొరికిన 148 మందిలో చాలామంది ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్

రెండు వారాల్లో రూ. 10 పెరిగిన పెట్రోల్ రేటు

రూపాయికే కిలో ఉల్లి అమ్మిన రైతులు