
జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. ముగ్గురు సహచర జవాన్లను తన సర్వీసు రైఫిల్‌తో కాల్చి చంపాడు. దీంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అపై అదే రైఫిల్‌తో తనని తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ కాల్పుల శబ్ధాన్ని గ్రహించిన జవాన్‌లు వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్థుతం అతని ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్ ఉద్దంపూర్‌లోని 187వ బెటాలియన్ క్యాంపులో జరిగింది. అక్కడ పనిచేస్తున్న అజిత్ కుమార్ అనే సీఆర్పీఎఫ్ జవాన్‌తో తోటి సహచరులు వాగ్వాదానికి దిగడంతోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. మృతి చెందిన వారు రాజస్థాన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆర్ పొకార్మల్, ఢిల్లీకి చెందిన యోగేంద్ర శర్మ, హర్యానాకు చెందిన ఉమెద్ సింగ్‌లుగా గుర్తించారు.