టెర్రరిస్టులను ఏరిపారేయండి: బలగాలకు మోడీ పూర్తి స్వేచ్ఛ

టెర్రరిస్టులను ఏరిపారేయండి: బలగాలకు మోడీ పూర్తి స్వేచ్ఛ

ప్రతీకారం మీ ఇష్టం.. ఎప్పుడు, ఎక్కడనేది మీరే డిసైడ్‌ చేయండి

టెర్రరిస్టు లకు సహకరిస్తు న్న పాక్‌ భారీ మూల్యం చెల్లించక తప్పదు: ప్రధాని మోడీ

బద్ లేంగే హమ్‌

పుల్వామా దాడిపై CRPF ట్వీట్

న్యూ ఢిల్లీ: పుల్వామాలో జరిగిన టెర్రరిస్టు అటాక్ పై సెంట్రల్ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్ (CRPF) భావోద్వేగ సందేశాన్నిచ్చింది. ‘‘మేం మరచిపోం, క్షమించలేం, ఈ క్రూరమైన చర్యకు ప్రతీకారం తీర్చుకుంటాం. ప్రాణాలు కోల్పోయిన మా సోదరుల కుటుంబాలకు అండగా ఉంటాం’’ అంటూ దేశంలోనే అతిపెద్ద దళమైన పారామిలిటరీ ఫోర్స్ సీఆర్పీఎఫ్ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. శుక్రవారం దేశవ్యాప్తంగా CRPF అధికారులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు. జాతీయ జెండాను అవనతం చేసి సంతాపం ప్రకటించారు.

వృథా కాదు మీ త్యాగం

 ఉగ్రవాదంపై అమర జవాన్ల కుటుంబాల పిడికిలి

 చాన్సిస్తే దేశం కోసం ప్రాణాలిస్తామని ప్రతిజ్ఞ

అమరుల స్వగ్రామాల్లో అలుముకున్న విషాదం

‘బిచ్చమెత్తుకు నే దుస్థితి వచ్చినా పాకిస్తాన్​ బుద్ధిమారలేదు. పుల్వామా ఘటనను తలచుకుంటేనే భారతీయుల రక్తం సల సల మరిగిపోతోంది. అమరుల త్యా గాలు వృథా కానివ్వం . ఇక ఏ మాత్రం ఉపేక్షించేది లేదు. దాయాది భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ప్రధాని మోడీ హెచ్చరిం చారు. టెర్రరిస్టు లను ఏరిపారేసేందుకు భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘ఎలా స్పం దిస్తారో మీ ఇష్టం . టైం, ప్లేస్ ను మీరే డిసైడ్​ చేయండి. మీ నిర్ణయమే ఫైనల్. మీ వెంట 130 కోట్ల మంది భారతీయులు ఉంటారు ’ అని సైన్యా నికి నిర్దేశించారు.

జమ్ముకాశ్మీర్ లోని పుల్వామా టెర్రర్‌ అటాక్‌లో ప్రాణాలు కోల్పోయిన 40 మంది అమర జవాన్లకు శుక్రవారం యావత్ దేశం అశ్రు నివాళులర్పించిం ది. దేశవ్యా ప్తంగా శాంతి ర్యా లీలు జరిగాయి. ప్రపంచ దేశాలు భారత్ కు అండగా నిలిచాయి. టెర్రరిజాన్ని, దానికి స్వర్గధామమైన పాక్​​తీరును ముక్తకంఠంతో ఖండిం చాయి. పార్టీ లేదు.. ప్రాంతం లేదు.. అందరి లక్ష్యం టెర్రరిజం అంతమేనని, దాని పీచమణిచేం దుకు కేం ద్ర ప్రభుత్వం, సైన్యం తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రతిపక్షాలు ముందుకు వచ్చాయి.

శ్రీనగర్ నుంచి సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టుకు జవాన్ల పార్థివ దేహాలను తీసుకువచ్చారు. అక్కడ ప్రధాని సహా ఇతర నేతలు నివాళులర్పిం చారు. తర్వాత పార్థివ దేహాలను స్వస్థలాలకు తరలించారు.