స్వల్పంగా పెరిగిన గోల్డ్, వెండి ధరలు

స్వల్పంగా పెరిగిన గోల్డ్, వెండి ధరలు

హైదరాబాద్ : దేశంలో పసిడి, వెండి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో, అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి. గురువారం (అక్టోబర్ 12న) హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58 వేల 910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54 వేలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75 వేల 500గా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర రూ.500 పెరిగింది. 

బుధవారం (అక్టోబర్ 11న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 58 వేల 530 ఉండగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53 వేల 650గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజుకే రూ.380 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజుకే రూ.350 పెరిగింది.

విజయవాడలో గురువారం (అక్టోబర్ 12న) 22 క్యారెట్ల బంగారం ధర 54 వేల రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం 58 వేల 910 రూపాయలుగా ఉంది. 

ఇక ఢిల్లీలో పసిడి  ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54 వేల 150, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 59 వేల 60గా ఉంది. వెండి ధర కిలోకు రూ. 72 వేల 100గా ఉంది. 

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా  ధరలతో సమానంగా రూ.58 వేల 910గా ఉంది. ముంబైలో ఒక కేజీ వెండి  ధర రూ.72 వేల 100 వద్ద ట్రేడవుతోంది.