క్రిప్టోలను వెంటాడుతున్న యూఎస్‌‌‌‌టీ సంక్షోభం

V6 Velugu Posted on May 15, 2022

  •     క్రిప్టోలను వెంటాడుతున్న యూఎస్‌‌‌‌టీ సంక్షోభం
  •     ఇప్పటిలో  రికవరీ కష్టమంటున్న ఎనలిస్టులు

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు: గత ఆరు వారాలుగా ఈక్విటీ, క్రిప్టో ఇన్వెస్టర్లకు కునుకులేదనే చెప్పాలి. ముఖ్యంగా క్రిప్టో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. టాప్ క్రిప్టో కరెన్సీలూ సైతం తమ వాల్యూలో కనీసం 30 % నష్టపోయాయి.  బిట్‌‌కాయిన్‌‌ చూస్తే కిందటేడాది జనవరి లెవెల్‌‌కు పడిపోయింది. ఈ క్రిప్టో వాల్యూ 27,194 డాలర్ల (రూ. 21 లక్షల) కు దిగొచ్చింది. అక్కడి నుంచి కొద్దిగా పెరిగి 29 వేల డాలర్ల దగ్గర ప్రస్తుతం ట్రేడవుతోంది. కిందటేడాది నవంబర్‌‌‌‌లో బిట్‌‌కాయిన్ వాల్యూ 68,990 డాలర్ల (రూ. 53 లక్షల) వద్ద ఆల్‌‌టైమ్ హైని టచ్ చేసింది. ప్రస్తుతం ఆ లెవెల్‌‌ నుంచి 50 శాతానికి పైగా నష్టపోయి ట్రేడవుతోంది. మార్కెట్ క్యాప్ ప్రకారం, రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన ఎథరమ్‌‌ గత ఆరు వారాల్లో 23 % తగ్గి 1,841 డాలర్లకు పడింది. ఎక్స్‌‌ఆర్‌‌‌‌పీ (34 %), సోలానా (38 %), కార్డానో (35 %), స్టెల్లర్‌‌‌‌ (29 %), అవలాంచ్‌‌ (39 %), పాల్కడాట్‌‌ (32 %), టెర్రా యూఎస్‌‌డీ (55%) టోకెన్లు కూడా ఎక్కువగా పడ్డాయి.  క్రిప్టో మార్కెట్‌‌ గత నెలన్నర రోజుల్లోనే 830 బిలియన్ డాలర్లు తగ్గింది.

ఎందుకు పడుతున్నాయంటే..

01 గ్లోబల్‌‌గా వడ్డీ రేట్లు పెరుగుతుండడంతో షేర్లు, క్రిప్టోలు వంటి రిస్క్ ఎక్కువగా ఉండే అసెట్స్‌‌ నుంచి ఫండ్స్‌‌ను ఇన్వెస్టర్లు తీసేస్తున్నారు. బాండ్లు, గోల్డ్‌‌, డాలర్ వంటి సేఫ్ అసెట్స్‌‌ వైపు చూస్తున్నారు. అందుకే క్రిప్టో కరెన్సీలు భారీగా పడుతున్నాయి. షేరు మార్కెట్లు కూడా పడుతుండడాన్ని చూస్తున్నాం.

02క్రిప్టో కరెన్సీలు ఇంతలా క్రాష్ అవ్వడానికి ప్రధాన కారణం స్టేబుల్ కాయిన్ అయిన టెర్రాయూఎస్‌‌డీ(యూఎస్‌‌టీ) ని డాలర్‌‌‌‌ నుంచి వేరుచేయడమే. గతంలో యూఎస్‌‌టీని డాలర్‌‌‌‌తో ముడిపరిచారు. అంటే యూఎస్‌‌టీ విలువ ఒక డాలర్‌‌‌‌ వాల్యూకి సమానంగా ఉండేది. తాజాగా యూఎస్‌‌టీని డాలర్‌‌‌‌తో ముడిపెట్టకపోవడంతో ఈ క్రిప్టో వాల్యూ  55 % పడి 45 సెంట్లకు పడింది. దీని ప్రభావం మరో క్రిప్టో కరెన్సీ టెర్రా లూనా (లూనా) పై డైరెక్ట్‌‌గా పడింది. ఈ క్రిప్టో వాల్యూ శుక్రవారం 97 % తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్‌‌లో 118 డాలర్ల దగ్గర ఆల్‌‌టైమ్ హైని తాకిన ఈ కరెన్సీ, ప్రస్తుతం 37 సెంట్ల దగ్గర ట్రేడవుతోంది. యూఎస్‌‌టీ సంక్షోభంతో  ఇతర క్రిప్టో కరెన్సీలూ భారీగా పడుతున్నాయి. 

03రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం ఇప్పటిలో ముగిసేటట్టు కనిపించడం లేదు. దీంతో గ్లోబల్‌‌గా ఇన్‌‌ఫ్లేషన్ పెరుగుతోంది.  గ్లోబల్‌‌ ఎకానమీ దెబ్బతింటోంది. దీంతో క్రిప్టో అసెట్స్‌‌లో గ్రోత్ కనిపించడం లేదని చెప్పొచ్చు.

లూనా పతనం..ఎక్స్చేంజిలను తిడుతున్న ఇన్వెస్టర్లు
యూఎస్‌‌‌‌టీ సంక్షోభం దేశంలోని క్రిప్టో ఇన్వెస్టర్లను తాకుతోంది. టెర్రా బ్లాక్‌‌ చెయిన్‌‌కు చెందిన లూనా, శుక్రవారం సుమారు జీరోకి పడిన విషయం తెలి సిందే. ఈ క్రిప్టో కరెన్సీని దేశంలోని క్రిప్టో ఎక్స్చేంజిలు డీలిస్ట్ చేశాయి కూడా. క్రిప్టో కరెన్సీలు పడుతుండ డంపై  క్రిప్టో ఎక్స్చేంజిలను ఇన్వెస్టర్లు తిడుతున్నారు. లూనా కరెన్సీని కొనేం దుకు అనుమతి ఇవ్వడం లేదని కొంత మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది తమ ఇన్వెస్ట్‌‌ మెంట్లు ఈ క్రిప్టోలో ఉండిపోయాయని బాధపడుతున్నారు. దేశంలోని క్రిప్టో ఎక్స్చేంజిల్లో లూనా పాపులర్ కరెన్సీ కాగా, ఇందులో చాలా మంది డబ్బులు పెట్టారని అంచనా.

Tagged crypto investors, panic amid digital coin, bitcoin crash

Latest Videos

Subscribe Now

More News