
హైదరాబాద్, వెలుగు: ఆగస్టు 15న గోల్కొండ కోటలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. బుధవారం ఆయన సెక్రటేరియెట్ లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముందుగా సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్మారక చిహ్నం (మార్టిర్స్ మెమోరియల్) నివాళులు అర్పించనున్నారని తెలిపారు.