ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయండి : శాంతికుమారి

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయండి : శాంతికుమారి
  • అధికారులకు సీఎస్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: సీఎంగా రేవంత్‌‌ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం జరగనున్న కార్యక్రమం ఏర్పాట్లపై మంగళవారం సీఎస్ సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

డీజీపీ రవి గుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు పాల్గొన్నారు.