ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టినం: సీఎస్ శాంతికుమారి

ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టినం: సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టినట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. బుధవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో  చీఫ్​ఎలక్షన్​కమిషనర్​ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్రం తరఫున సీఎస్​ శాంతికుమారి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, డీజీపీ రవి గుప్తా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాల పల్లి, ములుగు జిల్లాలపై, పొరుగు రాష్ట్రమైన చత్తీస్ గఢ్ తో సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. తెలంగాణకు నాలుగు రాష్ట్రాల సరిహద్దు ఉందని, 154 చెక్ పోస్టులు తెరిచామని తెలిపారు. పోలీసు, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా శాఖలు సరిహద్దు రాష్ట్రాలతో కోఆర్డినేషన్ సమావేశాలను  నిర్వహించినట్లు చెప్పారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 69 .66 కోట్లను స్వాధీన పర్చుకున్నామని, వీటిలో రూ. 27 .38 నగదు, 10 కోట్ల విలువైన మద్యం, రూ. 16 .14 విలువైన డ్రగ్స్, నార్కోటిక్స్, రూ. 7 .49 కోట్ల విలువైన మెటల్స్ ఉన్నాయన్నారు.