మాస్టర్​ డిగ్రీకి నెట్‌

మాస్టర్​ డిగ్రీకి నెట్‌

సైన్స్‌ సబ్జెక్టుల్లో రీసెర్చ్​ చేయడానికి దేశవ్యాప్తంగా కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) కేంద్రాలు ఏర్పాటయ్యాయి. సైన్స్‌ విభాగాల్లో ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వీటిలో సీటు సాధించాలనుకునే ఔత్సాహికులు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించే సీఎస్‌ఐఆర్‌ నెట్‌ జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించాలి. అలాగే సైన్స్‌ కోర్సుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్, లెక్చరర్‌ పోస్టులకు నెట్‌ ఉపయోగపడుతుంది. ఇటీవలే వెలువడిన సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ ఎగ్జామ్​ ప్యాటర్న్​, సక్సెస్​ సీక్రెట్, నోటిఫికేషన్​ వివరాలు తెలుసుకుందాం.. 

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఏడాదికి రెండుసార్లు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తరఫున నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్‌) నిర్వహిస్తున్నారు. సీఎస్‌ఐఆర్‌కు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రయోగశాలలు ఉన్నాయి. వీటిలో పరిశోధనలు కొనసాగించుకునే అవకాశం జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌)తో లభిస్తుంది. సైన్స్, ఇంజినీరింగ్‌లో నాలుగేళ్ల యూజీ లేదా పీజీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవాళ్లు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధిస్తే ప్రతి నెల స్టైపెండ్‌ అందుకుంటూ రీసెర్చ్​ చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో శాస్త్రవేత్తగానూ రాణించవచ్చు. లెక్చరర్‌షిప్‌ అర్హతతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. పరిశోధన సంస్థలతోపాటు డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, శిక్షణ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లోనూ అవకాశాలుంటాయి. వీరు పరిశోధన, అభివృద్ధి (రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌)లో భాగం కావచ్చు.  

సబ్జెక్టులు:   కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానిటరీ సైన్సెస్‌,  లైఫ్‌ సైన్సెస్‌,  మేథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌.

అభ్యర్థులు చదువుకున్న కోర్సు ప్రకారం వీటిలో ఏదో ఒక సబ్జెక్టులో పరీక్ష రాయాలి. నాలుగేళ్ల యూజీ కోర్సులైన బీఈ, బీఎస్, బీఫార్మసీ.. మొదలైనవి పూర్తిచేసుకున్నవారికీ జేఆర్‌ఎఫ్‌ అవకాశం దక్కుతుంది. అయితే వీరు లెక్చరర్‌షిప్‌నకు అనర్హులు.

 
ఎగ్జామ్​ ప్యాటర్న్: 200 మార్కులకు అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో వస్తాయి.  పరీక్ష డ్యురేషన్​ 3 గంటలు ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు (ఎ, బి, సి) ఉంటాయి. 

పార్ట్‌ ఎ: అన్ని విభాగాల వారికీ ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో లాజికల్‌ రీజనింగ్, గ్రాఫికల్‌ అనాలిసిస్, అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ కంపారిజన్, సిరీస్‌ ఫార్మేషన్, పజిల్స్‌ మొదలైన అంశాల్లో 20 ప్రశ్నలు వస్తాయి. 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. ఈ విభాగానికి 30 మార్కులు. 

పార్ట్‌ బి: ఈ విభాగంలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆ సబ్జెక్టు ప్రకారం ప్రశ్నల సంఖ్య మారుతుంది. సబ్జెక్టుల్లో 25 నుంచి 50 వరకు ప్రశ్నలు ఉంటాయి. ఛాయిస్‌ ఉంది. ఈ విభాగానికి ఆ సబ్జెక్టు ప్రకారం 70 లేదా 75 మార్కులు ఉంటాయి. నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది.

పార్ట్‌ సి: ఈ విభాగంలో ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 30 నుంచి 80 వరకు ప్రశ్నలు వస్తాయి. ఛాయిస్‌ ఉంది. మ్యాథ్స్‌లో 95 మిగిలిన సబ్జెక్టుల్లో వంద మార్కులకు ఈ ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్‌ తప్ప మిగిలిన వాటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు వంతు చొప్పున తగ్గిస్తారు. సైంటిఫిక్‌ కాన్సెప్టులపై అభ్యర్థికి ఉన్న అవగాహన, పరిజ్ఞానం, అనువర్తిత ధోరణి మొదలైన అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలన్నీ అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి.

వెబ్​సైట్​లో ప్రీవియస్​ పేపర్స్​ 

మొత్తం ప్రశ్నపత్రం నుంచి సబ్జెక్టులవారీ.. ఫిజికల్‌ సైన్సెస్‌లో 75 ప్రశ్నలకు 55, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌లో 120కి 60, లైఫ్‌ సైన్సెస్‌లో 145కి 75, కెమికల్‌ సైన్సెస్‌లో 120కి 75, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్‌ అండ్‌ ప్లానిటరీ సైన్సెస్‌లో 150కి 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. సిలబస్, మాదిరి ప్రశ్నపత్రాలను https://www.csirhrdg.res.in/ నుంచి పొందవచ్చు. 

సబ్జెక్టులు‑సిలబస్ 

లైఫ్‌ సైన్సెస్‌: బోటనీ లేదా జువాలజీలో పీజీ పూర్తిచేసుకున్నవాళ్లు ఆధునిక బయాలజీ (మాలిక్యులార్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమికల్‌ టెక్నిక్స్, బయోఫిజిక్స్, స్పెక్ట్రోస్కోపీ) పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆధునిక బయాలజీలో పీజీ చేసినవారు క్లాసికల్‌ బయాలజీ, ఎకాలజీ, ఎవల్యూషన్, బయోడైవర్సిటీపై ఎక్కువ దృష్టి సారించాలి.

మాథమెటికల్‌ సైన్సెస్‌: స్టాటిస్టిక్స్, ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్, కాంప్లెక్స్, డిఫరెన్షియల్‌ అనాలిసిస్, మ్యాట్రిక్స్, డెరివేటివ్స్, వెక్టర్, త్రికోణమితి, జామెట్రీ పాఠ్యాంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానిటరీ సైన్సెస్‌: భూమి, సౌరవ్యవస్థ, సముద్రాలు, వాతావరణం, పర్యావరణం, భూగర్భశాస్త్రం, జియో కెమిస్ట్రీ, ఎకనామిక్‌ జియాలజీ, ఫిజికల్‌ జాగ్రఫీ, జియో ఫిజిక్స్, మెటీరియాలజీ, ఓషన్‌ సైన్స్‌ అంశాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి.

కెమికల్‌ సైన్సెస్‌: ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో.. రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీలో ఎసెమిట్రిక్‌ సింథసిస్, కన్ఫర్మేషనల్‌ అనాలిసిస్, ఆర్గానిక్‌ స్పెక్ట్రోస్కోపీ, రియేజెంట్స్, పెరిసైక్లిక్‌ చర్యలు, కాంతి రసాయనశాస్త్రం తదితర అంశాలనూ, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో.. సంశ్లిష్ట సమ్మేళనాలు, అనలిటికల్‌ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, కర్బన లోహ సమ్మేళనాలు, మెటల్‌ క్లస్టర్స్‌ మొదలైన అంశాలను అనువర్తిత ధోరణిలో విశ్లేషణాత్మకంగా చదవాలి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో.. క్వాంటమ్‌ కెమిస్ట్రీ, సాలిడ్‌స్టేట్, మాలిక్యులర్‌ స్పెక్ట్రోస్కోపీ, స్టాటిస్టికల్‌ థర్మోడైనమిక్స్, కెమికల్‌ కైనెటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంశాలను అనువర్తిత