అన్‌‌లిస్టెడ్ మార్కెట్‌‌లో సీఎస్‌‌కే మెరుపులు

అన్‌‌లిస్టెడ్ మార్కెట్‌‌లో సీఎస్‌‌కే మెరుపులు

సీఎస్‌‌కేలో వాటా పెంచుకుంటోన్న దమానీ
కొత్త ఫ్రాంచైజీ ఏర్పాటు వార్తలు

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌‌) చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్(సీఎస్‌‌కే) పేలవమైన ప్రదర్శనతో క్రికెట్ ఫ్యాన్స్‌‌ను నిరాశపరిచింది. కానీ, ఈ కంపెనీ షేర్లు మాత్రం అన్‌‌లిస్టెడ్ మార్కెట్‌‌లో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీలో తొమ్మిదో టీమ్‌‌ను యాడ్ చేయాలనే వార్తలు రావడంతో టీమ్‌‌లకు రెవెన్యూలు పెరుగుతాయనే న్యూస్ మార్కెట్‌‌లో చక్కర్లు కొడుతోంది. అంతేకాక దలాల్  స్ట్రీట్ వెటర్న్‌‌, డీమార్ట్‌‌ అధినేత రాధాకిషన్ దమానీ సీఎస్‌‌కే కంపెనీలో వాటాను క్రమక్రమంగా పెంచుకుంటున్నారు. ఈ రెండు కారణాలతో సీఎస్‌‌కే షేర్లు అన్‌‌లిస్టెడ్ మార్కెట్‌‌లో మస్తు జోరుమీదున్నాయి. ఎంఎస్‌‌ ధోని టీమ్‌‌ లీడర్ అయిన సీఎస్‌‌కే అన్‌‌లిస్టెడ్ స్పేస్‌‌లో మల్టిబ్యాగర్‌‌‌‌గా నిలుస్తున్నట్టు డీలర్స్ చెప్పారు. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఈ స్టాక్ 400 శాతం వరకు ర్యాలీ చేసింది. ఒకప్పుడు రూ.12-–15 మధ్య పలికే ఈ షేరు రెండేళ్లలోనే రూ.48-–50కు చేరుకుంది. ఆఫ్ మార్కెట్ డీలర్స్ ఈ స్టాక్‌‌పై బుల్లిష్‌‌గా ఉన్నట్టు చెప్పారు. వచ్చే ఐపీఎల్ సీజన్‌‌ కల్లా ప్రస్తుత మార్కెట్ ధర 100 శాతం వరకు జంప్ చేస్తుందని అన్నారు. కంపెనీ  ఫండమెంటల్స్ బాగున్నాయన్నారు.

ఆర్‌‌‌‌కే దమానీకి 2019 మార్చి 31 నాటికి సీఎస్‌‌కే కంపెనీలో 2.39 శాతం వాటా ఉంది. అంటే 73,69,263 షేర్లు ఈయన పేరుమీదే ఉన్నాయి. 2020 మార్చి 31నాటికి ఈయన షేర్‌‌‌‌హోల్డింగ్ కంపెనీలో 55 బేసిస్ పాయింట్లు పెరిగి 2.94 శాతానికి చేరుకుంది. అంటే 90,69,263 షేర్లు ఈయన పేరుమీదకి వచ్చాయి. రాధాకిషన్  దమానీ కంపెనీలో తన వాటాను కంటిన్యూగా పెంచుకుంటున్నారని, ఇది వచ్చే యాన్యువల్ రిపోర్ట్‌‌లో తెలుస్తుందని కొందరు డీలర్స్ చెప్పారు. లిస్టెడ్ కంపెనీల మాదిరి అన్‌‌లిస్టెడ్ కంపెనీలు తమ షేర్‌‌‌‌హోల్డింగ్ వివరాలను క్వార్టర్లీ లెక్కన విడుదల చేయవు. ఇదే కంపెనీలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌‌ఐసీ) వాటా 6.04 శాతంగా ఉంది. ఎల్‌‌ఐసీ వాటా స్థిరంగా ఉంది. తక్కువ వాల్యుయేషన్‌‌తో, మంచి ఫండమెంటల్స్‌‌ సీఎస్‌‌కే కంపెనీకున్నాయని అన్‌‌లిస్టెడ్ షేర్లలో డీల్‌‌ చేసే అల్టియస్ ఇన్వెస్టెక్ సందీప్‌‌ గినోడియా తెలిపారు. తాజా ఐపీఎల్ సీజన్‌‌లో ఈ టీమ్ అంతగా ఆడలేకపోయినా.. ఎకనమిక్ డౌన్‌‌టర్న్ ఉన్నా.. సీఎస్‌‌కే మంచి లాభాలనే పండిస్తోందని అన్నారు. కొత్త ఐపీఎల్ టీమ్‌‌ను యాడ్ చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవేళ తొమ్మిదో టీమ్ యాడ్ అయితే మ్యాచ్‌‌లు పెరిగి, రెవెన్యూలు పెరిగేందుకు సాయపడుతుందన్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌‌లో ఎనిమిది టీమ్‌‌లున్నాయి. మార్కెట్ సమాచారం ప్రకారం తొమ్మిదో టీమ్ వాల్యు రూ.3 వేల కోట్ల నుంచి రూ.3,500 కోట్ల వరకు ఉండనుంది. ప్రస్తుతం సీఎస్‌‌కే వాల్యు దీనిలో సగం ఉంది. కొత్త టీమ్ యాడ్ చేసేందుకు అహ్మదాబాద్‌‌ను బేస్ సిటీగా తీసుకుంటున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. అదానీ గ్రూప్, ఆర్‌‌‌‌పీజీ గ్రూప్‌‌లు ఈ టీమ్‌‌ను సొంతం చేసుకునేందుకు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.

పెరిగిన అడ్వర్‌‌‌‌టైజ్‌‌మెంట్ రెవెన్యూ..

సీఎస్‌‌కే దేశీయ మార్కెట్‌‌లో లిస్ట్ కాలేదు. ఈ స్టాక్ ఫెయిర్ వాల్యు ఎంత ఉందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. మరోవైపు కరోనా మహమ్మారి ఉన్నా ఈ ఐపీఎల్ సీజన్ విజయవంతంగా ముగిసింది. ఇది ఫ్రాంచైజీలకు మరింత వాల్యును చేకూర్చినట్టు అల్టిమేట్ వెల్త్‌‌ఓల్ తెలిపారు. వచ్చే ఐపీఎల్ సీజన్(ఏప్రిల్–మే) కంటే ముందే ప్రతిపాదిత కొత్త టీమ్ ఆక్షన్‌‌కు వస్తే.. సీఎస్‌‌కే స్టాక్ వాల్యు మరింత పెరుగుతుందన్నారు. టామ్ యాడ్‌‌ఎక్స్ తాజా రిపోర్ట్ ప్రకారం ఐపీఎల్13లో అంతకుముందు సీజన్‌‌తో పోలిస్తే అడ్వర్‌‌‌‌టైజర్లు, బ్రాండ్లు 3 శాతం నుంచి 5 శాతం  పెరిగాయి. 92 కేటగిరీల్లో, 115 అడ్వర్‌‌‌‌టైజర్లు, 249 బ్రాండ్లు ఈ సీజన్‌‌లో పాల్గొన్నాయి. అడ్వర్‌‌‌‌టైజ్‌‌మెంట్ రెవెన్యూ, వ్యూయర్‌‌‌‌షిప్ విషయంలో ఈ ఐపీఎల్13 సీజన్ రికార్డులను సొంతం చేసుకుంది.