ఐపీఎల్ ఫైనల్ మ్యాచును పండగ చేసుకున్న ప్రేమికులు.. స్విగ్గీకి భలే బేరం

ఐపీఎల్ ఫైనల్ మ్యాచును పండగ చేసుకున్న ప్రేమికులు.. స్విగ్గీకి భలే బేరం

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచును ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమకు అనుకూలంగా మలుచుకుంది. ప్రేమికులకు కండోమ్స్‌ డెలివరీ చేయటం ద్వారా భారీ లాభాలు ఆర్జించింది. ఈ విషయాన్ని స్విగ్గీనే స్వయంగా వెల్లడించింది. సోమవారం రాత్రి 8.30 గంటల వరకు 2,324 కండోమ్స్‌ డోర్ డెలివరీ చేసినట్లు చెప్పుకొచ్చిన స్విగ్గీ, ఇంకా చాలా డెలివరీ చేయాల్సి ఉందని ట్వీట్ చేసింది.

అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగడంతో దేశం నలుమూలల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. లాడ్జ్‌ లు, పీజీల ముందట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. అందులోనూ వర్షం కలిగించడతో మూడు గంటల మ్యాచ్ కాస్తా.. మూడు రోజులు సాగింది. ఇదే అవకాశం అనుకున్న ప్రేమికులు మరింత రెచ్చిపోయారు. ఇదిలావుంటే ఈ మ్యాచులో చెన్నై ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది.   

ఇక జియో సినిమాలో 3.2 కోట్ల మంది ఒకేసారి మ్యాచును వీక్షించారు. గతంలో 2.57 కొల్తు అత్యధికం కాగా, రాత్రి మ్యాచుతో ఆ రికార్డ్ బద్దలైంది.