CSK vs KKR: ఆడుతూ పాడుతూ ముగించారు.. చెన్నై చేతిలో కోల్‌క‌తా ఓటమి

CSK vs KKR: ఆడుతూ పాడుతూ ముగించారు.. చెన్నై చేతిలో కోల్‌క‌తా ఓటమి

సొంత స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ త‌డాఖా చూపించింది. బలమైన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌‌ను అలవోకగా చిత్తుచేసింది. మొదట బౌలర్లు విజృంభించడంతో కోల్‌క‌తా 137 పరుగులకే పరిమితమవ్వగా.. ఆ లక్ష్యాన్ని చెన్నై బ్యాటర్లు ఆడుతూ పాడుతూ చేధించారు. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి.. మరో 14 బంతులు మిగిలివుండగానే ఛేదించి రన్‌రేట్ మెరుగు పరుచుకున్నారు. ఛేదనలో రుతురాజ్ గైక్వాడ్(67 నాటౌట్; 58 బంతుల్లో 9 ఫోర్లు) పరుగులతో రాణించాడు. 

సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి రూపంలో కోల్‌క‌తా జట్టులో నాణ్యమైన బౌలర్లున్నా.. లక్ష్యం చిన్నది కావడంతో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(49 నాటౌట్) నిలకడగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. రచిన్ రవీంద్ర(15;  8 బంతుల్లో 3 ఫోర్లు), డారెల్ మిచెల్(25; 19 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌), శివమ్ దూబే(28; 18 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్స్‌లు) పరుగులు చేశారు.

దెబ్బకొట్టిన జడేజా

అంతకుముందు రవీంద్ర జడేజా(3 వికెట్లు), తుషార్ దేశ్‌పాండే(3 వికెట్లు), ముస్తాఫిజర్ రెహ్మాన్(2 వికెట్లు) దెబ్బకు కోల్‌క‌తా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. జ‌డేజా, తీక్షణ స్పిన్‌తో భయపెడితే..ముస్తఫిజుర్, దేశ్‌పాండేలు పేస్‌తో హ‌డ‌లెత్తించారు. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యర్ 34 ర‌న్స్‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఓపెన‌ర్ సునీల్ న‌రైన్(27), అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ(24)లు మాత్రమే రాణించారు.