ఎమ్మెల్యే చొరవతో స్కూల్​కు సీఎస్ఆర్​ ఫండ్స్

ఎమ్మెల్యే చొరవతో స్కూల్​కు సీఎస్ఆర్​ ఫండ్స్

నవాబుపేట, వెలుగు: ఎమ్యెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి చొరవతో మండలంలోని హన్మసానిపల్లి ప్రైమరీ స్కూల్​ రిపేర్ల కోసం రూ.7.37 లక్షల సీఎస్ఆర్​ ఫండ్స్​ రిలీజ్​ అయ్యాయి. గ్రామంలోని గవర్నమెంట్​ స్కూల్​ సమస్యలను గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్​ సరిపల్లికి ట్విట్టర్​లో పోస్ట్​చేశారు. అతడి కంపెనీ ఎంవైకే ఆర్మెంట్​ ప్రైవేట్​ లిమిటెడ్​ నుంచి సీఎస్ఆర్​ స్కీంలో భాగంగా స్కూల్​కు ఫండ్స్​ మంజూరు చేయాలని కోరారు.

ఎమ్యెల్యే పోస్ట్​కు స్పందించిన శ్రీకర్​ తన కంపెనీ సీఎస్ఆర్​ ఫండ్స్​ నుంచి స్కూల్​ రిపేర్ల కోసం రూ.7.37 లక్షలను కేటాయించారు. త్వరలోనే పనులను ప్రారంభిస్తామని ఎమ్యెల్యే అనిరుధ్​రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని స్కూళ్లలో సమస్యలు గుర్తించి ప్రభుత్వ నిధులతో పాటు తనకు తెలిసిన కార్పొరేట్​ కంపెనీల సాయంతో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. స్కూల్​ సమస్యపై స్పందించి నిధులను మంజూరు చేయించిన ఎమ్యెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.