
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ పోలీసులు కర్ఫ్యూ విధించారు. మంగళవారం మొహర్రం సందర్భంగా అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ సహా పలు ప్రాంతాల్లో సాయుధ పోలీసులను భారీగా మోహరించారు. లాల్‌చౌక్‌లో ఎవరూ ఊరేగింపులు నిర్వహించకుండా కంచె వేశారు. అత్యవసర వైద్య సేవల కోసం కొంత మంది వైద్య సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కర్ఫ్యూ కారణంగా పలు నగరాల్లో విద్య, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి.