
హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో బుధవారం నుంచి కర్ఫ్యూ విధించారు. కుంభమేళాలో పవిత్రమైన ఆఖరు షాహీ స్నానాలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హరిద్వార్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని అర్బన్ ఏరియాలు, రూరల్ ఏరియాల్లో మే 3 వరకు పూర్తి కర్ఫ్యూ అమల్లోకి ఉండనుంది. కరోనా విజృంభిస్తుండటంతో హరిద్వార్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలతోపాటు పలు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలు చేస్తూ స్టేట్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. కుంభమేళాలో చివరి షాహీ స్నానాలు మంగళవారంతో ముగిశాయి.