ఉద్యోగమస్తు

ఉద్యోగమస్తు

స్పోర్ట్స్

సింగపూర్‌‌ ఓపెన్‌‌ టైటిల్‌‌


రెండుసార్లు ఒలింపిక్‌‌ పతక విజేత పీవీ సింధు మొదటిసారి సింగపూర్‌‌ ఓపెన్‌‌ సూపర్‌‌ 500 టోర్నీలో విజయం సాధించింది. ఈ ఏడాది ఇప్పటికే సయ్యద్‌‌ మోడీ, స్విస్‌‌ ఓపెన్‌‌ నెగ్గిన ఈ హైదరాబాదీ షట్లర్‌‌ ఇప్పుడు మూడో టైటిల్‌‌ను సొంతం చేసుకుంది. .

ఐఎస్‌‌ఎస్‌‌ఎఫ్‌‌ ప్రపంచకప్‌‌


ఐఎస్‌‌ఎస్‌‌ఎఫ్‌‌ షూటింగ్‌‌ ప్రపంచకప్‌‌లో ఇండియా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.  5 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలతో  నంబర్‌‌వన్‌‌గా నిలిచింది. ప్రపంచకప్‌‌లో భారత్‌‌ ప్రథమ స్థానం సాధించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. 

నేషనల్ 

ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌‌ పేర్ల మార్పు
మహారాష్ట్రలో రెండు నగరాల పేర్లు మార్చేందుకు ఏక్‌‌నాథ్‌‌ శిందే ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఔరంగాబాద్‌‌ పేరును ఛత్రపతి సంభాజీనగర్‌‌గాను, ఉస్మానాబాద్‌‌ను ధారాశివ్‌‌గాను మార్చేందుకు అంగీకరించింది. ఈ నగరాల పేర్లను మార్చాలని ఇంతకుముందున్న మహా వికాస్‌‌ అఘాడీ నిర్ణయించింది.

గణేశన్‌‌కు బెంగాల్‌‌ గవర్నర్​ బాధ్యతలు
ఎన్డీయే కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో పశ్చిమ బెంగాల్‌‌ గవర్నర్‌‌ పదవికి జగదీప్‌‌ ధన్‌‌ఖడ్‌‌ చేసిన రాజీనామాను చేశారు. దీంతో మణిపుర్‌‌ గవర్నర్‌‌ లా గణేశన్‌‌కు బెంగాల్‌‌ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌‌ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ద్రవ్యోల్బణం
తెలుగు రాష్ట్రాల ద్రవ్యోల్బణం రేటు జూన్‌‌లో దేశంలోనే అత్యధికంగా ఉందని రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఆర్‌‌బీఐ) పేర్కొంది. తెలంగాణలో దేశంలోనే అత్యధికంగా 10.05 శాతం ఉండగా 8.6 శాతంతో ఆ తర్వాతి స్థానంలో ఏపీ ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో10.93 శాతం కాగా పట్టణాల్లో 9.23 శాతంగా నమోదు అయింది. 

వ్యక్తులు

ఆశిష్‌‌ కుమార్‌‌
నేషనల్‌‌ స్టాక్‌‌ ఎక్స్ఛేంజ్‌‌ (ఎన్‌‌ఎస్‌‌ఈ) తదుపరి మేనేజింగ్‌‌ డైరెక్టర్, సీఈఓగా ఆశిష్‌‌కుమార్‌‌ చౌహాన్‌‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన నియామకానికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదం లభించిందని ఎన్‌‌ఎస్‌‌ఈ వెల్లడించింది. వాటాదార్ల ఆమోదంతో పాటు ఎన్‌‌ఎస్‌‌ఈ ఆఫర్‌‌కు ఆయన అంగీకరిస్తే  నియామకం ఖరారవుతుంది. 

శ్రీశ్రీ రవిశంకర్‌‌
దక్షిణ అమెరికా తీరప్రాంత దేశమైన సురినామ్‌‌ తమ దేశ అత్యున్నత పౌర అవార్డు ‘ఆనరరీ ఆర్డర్‌‌ ఆఫ్‌‌ ది ఎల్లో స్టార్‌‌’తో భారత ఆధ్యాత్మిక గురువు, ‘ఆర్ట్‌‌ ఆఫ్‌‌ లివింగ్‌‌’ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌‌ను సత్కరించింది. సురినామ్‌‌ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్‌‌ సంతోఖి ఈ అవార్డును అందజేశారు.

బెన్‌‌ స్టోక్స్‌‌ 
ప్రపంచ మేటి ఆల్‌‌రౌండర్లలో ఒకడైన ఇంగ్లాండ్‌‌ ఆటగాడు బెన్‌‌ స్టోక్స్‌‌ వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఇంగ్లాండ్‌‌ మొదటి సారి వన్డే విశ్వ విజేత (2019)గా నిలవడంలో అతను కీలక పాత్ర పోషించారు. స్టోక్స్‌‌ ఇప్పటివరకూ 104 వన్డేల్లో 2919 పరుగులు చేశాడు. అందులో మూడు శతకాలున్నాయి. 74 వికెట్లూ పడగొట్టాడు.

అనిల్‌‌ అగర్వాల్‌‌
ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ తెలంగాణ ఛాంబర్స్‌‌ ఆఫ్‌‌ కామర్స్‌‌ అండ్‌‌ ఇండస్ట్రీ (ఎఫ్‌‌టీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా జీవకా ఇండస్ట్రీస్‌‌ మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ అనిల్‌‌ అగర్వాల్‌‌ ఎన్నికయ్యారు. 

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము


రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించి, 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి గిరిజన మహిళగా నిలిచారు.  అత్యున్నత పదవి చేపట్టిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ముర్ము ప్రత్యర్థి యశ్వంత్‌‌ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

ప్రతిభారాయ్‌‌

డా.సి.నారాయణ రెడ్డి పేరిట సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు నెలకొల్పిన ప్రతిష్ఠాత్మక జాతీయ సాహిత్య పురస్కారాన్ని 2022లో ఒడియా రచయిత్రి డా.ప్రతిభారాయ్‌‌కు అందజేయనున్నారు. జులై 29న సినారే జయంతి ఉత్సవంలో పురస్కారం అందజేస్తారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ

సింధు ధ్వజ్‌‌ సబ్‌‌మెరైన్‌‌ వీడ్కోలు
భారత నౌకాదళం విజయాల్లో కీలక పాత్ర పోషించిన సింధు ధ్వజ్‌‌ సబ్‌‌మెరైన్‌‌ 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత విధుల నుంచి నిష్క్రమించింది. 35 ఏళ్ల క్రితం రష్యా నుంచి కొనుగోలు చేశారు.

‘దునగిరి’ స్టెల్త్‌‌ యుద్ధ నౌక ప్రారంభం
హుగ్లీ నదిలో భారత నౌకాదళానికి చెందిన ‘దునగిరి’ స్టెల్త్‌‌ యుద్ధ నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్‌‌ సింగ్‌‌ ప్రారంభించారు. 

ఇంటర్నేషనల్ 

జపాన్‌‌.. స్ట్రాంగెస్ట్​ పాస్​పోర్ట్​  


ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదిగా జపాన్‌‌ పాస్‌‌పోర్ట్‌‌ నిలిచింది.   ముందస్తు వీసా లేకుండానే ఆ పాస్​పోర్ట్​తో 193 దేశాలకు దాంతో ప్రయాణించవచ్చు. సింగపూర్, సౌత్​ కొరియా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్‌‌ 87వ స్థానంలో (60 దేశాలు) ఉంది. 

తెలంగాణ

సంకోజు వేణుకు దాశరథి పురస్కారం


నల్గొండకు చెందిన సాహితీవేత్త సంకోజు వేణును తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ పురస్కారం కింద రూ.1,01,116 నగదుతో పాటు జ్ఞాపికను కృష్ణమాచార్య జయంతి రోజు అందజేసింది.

శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్‌‌ విక్రమసింఘె
ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉన్న శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్‌‌ విక్రమసింఘె ఎన్నికయ్యారు. పార్లమెంటులో ఓటింగ్‌‌ నిర్వహించగా మెజార్టీ సభ్యులు రణిల్‌‌కే మద్దతు పలికారు. మొత్తం 225 మంది సభ్యుల్లో 134 మంది ఆయనకు ఓటేశారు. 2024 నవంబరు వరకు పదవిలో ఉండనున్నారు.

యూబీఎస్​ అధ్యక్షురాలిగా నౌరీన్
ఆర్థిక సేవల సంస్థ యూబీఎస్‌‌ అమెరికా అధ్యక్షురాలిగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్‌‌ బ్యాంకు యూబీఎస్‌‌ అమెరికా హోల్డింగ్‌‌ సీఈవోగా భారత–అమెరికన్‌‌ నౌరీన్‌‌ హసన్‌‌ నియమితులు కానున్నారు. ప్రస్తుతం ఫెడరల్‌‌ రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ న్యూయార్క్‌‌ ఉపాధ్యక్షురాలిగా, చీఫ్‌‌ ఆపరేటింగ్‌‌ ఆఫీసర్‌‌గా ఉన్నారు.