కరెంట్​ టాపిక్ : రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు

కరెంట్​ టాపిక్ : రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు

చంద్రుడిపైకి 2030 నాటికి మానవ సహిత యాత్ర చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా భూ దిగువ కక్ష్యలోని(లో ఎర్త్​ ఆర్బిట్) తన రోదసి కేంద్రంలోకి వ్యోమగాములు యెగువాంగు, లీ కాంగ్​, లీ గువాంగ్సులను షెంఝౌ–18 వ్యోమనౌక ద్వారా పంపనుంది. వీరిలో కాంగ్​, గువాంగ్సులకు ఇది తొలి యాత్ర. గోబీ ఎడారిలోని జియుక్వాన్​ ఉపగ్రహ కేంద్రం నుంచి వ్యోమగాములు రోదసిలోకి పయనమవుతారు. 

  • ఈ అంతరిక్షయాత్రలో భాగంగా భూ కక్ష్యలోని తియాంగాంగ్​ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలలు బస చేస్తారు. ప్రస్తుతం రోదసిలోకి వెళ్తున్న వ్యోమగాములు శాస్త్రీయ పరిశోధనలు చేపడతారు.
  • అంతరిక్ష వ్యర్థాల నుంచి రక్షణ కల్పించే సాధనాలను తియాంగాంగ్​ రోదసి కేంద్రానికి అమరుస్తారు. సైన్స్​కు ఆదరణ కల్పించే కసరత్తును చేపడతారు. 
  • తన అంతరిక్ష కేంద్రంలోకి విదేశీ వ్యోమగాములు, అంతరిక్ష పర్యాటకులను అనుమతిచ్చేందుకూ చైనా కసరత్తు చేస్తోంది.