చరణ్ మూవీపై కస్టడీ ఎఫెక్ట్.. పాపం మెగా ఫ్యాన్స్

చరణ్ మూవీపై కస్టడీ ఎఫెక్ట్.. పాపం మెగా ఫ్యాన్స్

కస్టడీ మూవీ ఎఫెక్ట్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారట. దీంతో.. గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటో అంటూ ఆందోళన చెందుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. తమిళ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. తాజాగా తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు, నాగ చైతన్య కాబోలో వచ్చిన కస్టడీ మూవీ కూడా అటకెక్కేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

అంతకుముందు.. మహేష్,మురుగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్ మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో, తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ చేసిన నోటా కూడా నిరాశ పరిచింది. ఇక రామ్ హీరో గా లింగు స్వామి దర్శకత్వంలో వచ్చిన ది వారియర్ సినిమాకి కూడా సమె సీన్ రిపీట్. ఇక రీసెంట్ గా కస్టడీ. దీంతో తమిళ దర్శకులు తెలుగు లో సక్సెస్ అవ్వలేరు అనే సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీని కూడా తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు.మరి ఈ సినిమాతోనైనా ఆ సెంటిమెంట్ ని బ్రేక్ అవుతుందా.. లేక సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అని మెగా  ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. అయితే కొందరు మెగా ఫ్యాన్స్ మాత్రం ఇతర సినిమాలకు... చరణ్ సినిమాకు చాలా తేడా ఉంటుందని, శంకర్ సినిమాకు ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా.. కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.