ఓటీటీలోకి కస్టడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

ఓటీటీలోకి కస్టడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

అక్కినేని నాగచైతన్య, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబోలో వచ్చిన తాజా చిత్రం 'కస్టడీ'. లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే.. తాజాగా  ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమాకు కిడా యావరేజ్ టాక్ రావడంతో.. త్వరలోనే ఈ సినిమా ఓటీటీకి వచ్చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా వచ్చే నెల మొదటి వారంలో గానీ.. ఆ నెక్స్ట్ వీక్ లో గానీ స్ట్రీమింగ్‌ రానుందని సమాచారం. ఇటీవలే విడుదలైన రావణాసుర, శాకుంతలం సినిమాలు కూడా భారీ డిజాస్టర్ కావడంతో నెల ముందుగానే ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే.