నేటితో ముగియనున్న ఫామ్ హౌస్ కేసు నిందితుల కస్టడీ

నేటితో ముగియనున్న ఫామ్ హౌస్ కేసు నిందితుల కస్టడీ

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు నిందితుల కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. నిందితులను రెండో రోజు కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులను ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. నిన్న ఏడు గంటల పాటు సుదీర్ఘంగా పోలీసులు వారిని విచారించారు. కస్టడీ తర్వాత ఇవాళ ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు ఇవాళ నిందితుల బెయిల్ పిటిషన్‭ని ఏసీబి కోర్టు విచారణ జరుపనుంది. 

మరికాసేపట్లో నిందితులను చంచల్ గూడ జైలు నుంచి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‭కు తరలించనున్నారు. ఇప్పటికే విచారణలో నిందితుల స్టేట్ మెంట్‭ను పోలీసులు రికార్డు చేశారు. ఇవాళ్టి విచారణ ఈ కేసులో మరింత కీలకం కానుంది. వారి వద్ద లభించిన  నకిలీ ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్, వంద కోట్ల డీల్ పై పోలీసులు వివరాలు సేకరించే అవకాశం ఉంది. ముగ్గురు నిందితులను ప్రశ్నించడం ద్వారా కేసులో పురోగతి సాధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.