వెల్దుర్తి, వెలుగు: కొనుగోలు కేంద్రంలో అమ్మిన వడ్ల డబ్బులు, పింఛన్ డబ్బులు ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంగళవారం మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ముందు ఖాతాదారులు ఆందోళన చేపట్టారు.
కెనరా బ్యాంకులో ఇటీవలే బ్యాంక్ మేనేజర్ బదిలీ కాగా, అతని స్థానంలో మరో అధికారి వచ్చి సెలవుపై వెళ్లడంతో లావాదేవీలు స్తంభించిపోయి, తమకు డబ్బులందక ఇబ్బందులు పడుతున్నామని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా డబ్బులు రాకపోవడంతో బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్నామన్నారు. ఇన్‌చార్జి మేనేజర్ స్పందిస్తూ ఈ సమస్యను ఆర్ఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
