మొహర్రం 2025: దట్టీలు సమర్పించిన సీపీ

మొహర్రం  2025: దట్టీలు సమర్పించిన సీపీ

మొహర్రం సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్  సీవీ ఆనంద్ తెలిపారు. దార్​-ఉల్​-షిఫా, డబీర్​ పురాలోని బీబీ కా ఆలంను శుక్రవారం ఆయన విజిట్​చేసి, దట్టీలు సమర్పించారు. తర్వాత బందోబస్తు , భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మొహర్రం సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు విజిట్​చేసే అవకాశం ఉన్నందున 3 వేల మంది పోలీసులతో  బందోబస్తు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సీపీతో పాటు సౌత్​జోన్ ​డీసీపీ స్నేహా మెహ్రా, ట్రాఫిక్​డీ సీపీ వెంకటేశ్వర్లు ఉన్నారు.