స్టేడియంలో నమాజ్ చేసినందుకు ICCకి ఫిర్యాదు

స్టేడియంలో నమాజ్ చేసినందుకు ICCకి ఫిర్యాదు

అక్టోబర్ 6వ తేదీన హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మైదానంలో నమాజ్ చేసినందుకు పాకిస్థాన్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌పై వినీత్ జిందాల్ అనే భారతీయ న్యాయవాది ఐసీసీలో ఫిర్యాదు చేశారు. చాలా మంది భారతీయుల ముందు ప్రార్థనలు చేయడం అనేది తాను ముస్లిం అని చూపించడమేనని, అది క్రీడా స్ఫూర్తిని ప్రభావితం చేస్తుందని జిందాల్ ఆరోపించారు.

మైదానంలో ప్రార్థనలు చేయడం, శ్రీలంకపై తన ప్రదర్శనను గాజాకు అంకితం చేయడం మతపరమైన, రాజకీయ భావజాలం పట్ల అతని బలమైన మొగ్గును మరింత నొక్కి చెబుతుందని జిందాల్ తన ఫిర్యాదులో తెలిపాడు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా రిజ్వాన్ 'జై శ్రీరాం' నినాదాలతో భారత క్రికెట్ అభిమానుల వైఖరిని ఎదుర్కొన్నాడు.