కామన్వెల్త్ గేమ్స్ లో మురళీ శ్రీ శంకర్ రికార్డ్

కామన్వెల్త్ గేమ్స్ లో మురళీ శ్రీ శంకర్ రికార్డ్

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు సంచలనాలు సృష్టిస్తున్నారు. అందులో భాగంగా భారత క్రికెటర్ మురళీ శ్రీ శంకర్ పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో 8.08 మీటర్ల మార్కుతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాదు లాంగ్ జంప్ లో భారత తరపునుంచి కామన్వెల్త్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారత పురుష అథ్లెట్ గా కూడా శ్రీ శంకర్ రికార్డు సృష్టించాడు. కాగా ఇప్పటికే పారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ భారత్ స్వర్ణం సాధించి, రెండో స్వర్ణాన్ని భారత్ ఖాతాలో వేశాడు. అయితే హైజంప్ లోనూ తేజస్విన్ అనే భారత క్రీడాకారుడు అద్భుతం సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా హైజంప్ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్ గా తేజస్విన్ కాంస్య పతకాన్ని సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మురళీ శ్రీ శంకర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి జరిగిన లాంగ్‌ జంప్‌ ఫైనల్లో  ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు దూకిన శ్రీశంకర్‌ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. కాగా బహమాస్‌కు చెందిన లకాన్‌ నైర్న్‌ కూడా 8.08 మీటర్లే దూకి స్వర్ణం గెలిచాడు. ఎందుకంటే లకాన్‌ రెండో ఉత్తమ ప్రదర్శన(7.98 మీటర్లు).. శ్రీశంకర్‌(7.84 మీటర్లు) కన్నా ఎక్కువగా ఉండడమే కారణం. జమైకాకు చెందిన థాంప్సన్‌(8.05 మీటర్లు) దూకి కాంస్యం గెలిచాడు.