సైబర్ నేరాలపై స్టూడెంట్స్ కు అవేర్నెస్

సైబర్ నేరాలపై  స్టూడెంట్స్ కు అవేర్నెస్

ఖమ్మం టౌన్, వెలుగు : సైబర్​ నేరాలపై సిటీలోని కృష్ణవేణి కాలేజ్ స్టూడెంట్స్​కు సైబర్ క్రైమ్ సీఐ నరసింహారావు బుధవారం అవగాహన కల్పించారు. బ్యాంకు అకౌంట్లలో డబ్బులు దోచుకోవడమే కాకుండా, ఫోన్లలోని రహస్య సమాచారాన్ని సైతం దొంగలిస్తారని వివరించారు. చాలామంది అవగాహన లేక వ్యక్తిగత గోప్యత, భద్రత కోల్పోతున్నారని చెప్పారు. 

సైబర్‌‌ నేరగాళ్ల చేతిలో పడి మోసపోతే వెంటనే సైబర్‌‌క్రైమ్‌‌ టోల్‌‌ప్రీ నంబర్‌‌ 1930కు కాల్‌‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్లికేషన్స్, ఆన్‌‌లైన్ జాబ్, కస్టమర్ కేర్, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్, ఒలెక్స్ పేర తదితర మోసాలు ఎలా ఉంటాయి? మోసపోతే ఎలా ఫిర్యాదు  చేయాలనే విషయాలపై అవగాహన కల్పించారు.